నాగ మురళి గారి కవిత్వానికి మూడు ఎప్పుడు వస్తుంది అన్న వ్యాసం చదివాక ... నాకు ఇలాంటిదే ఒక చిన్న పద్యం గుర్తుకు వచ్చి ఆది మీతో పంచుకో దలచాను.నేను ఇంతకు క్రితం పని చేసే కంపనీ లో మధ్యాహన్నం బోజన సమయంలో నేను మరియు మరో ఇద్దరు అయ్యవార్లు కలసి బొజనము చేసిన తర్వాత తాపీగా కూచోని చాలా విషయాలు మాట్లాడే వారము ... ఆ రోజు మేము తెచ్చుకున్న టిఫీను బాక్స్ లో వంకాయ కూర అదిరింది... దాని గురించి నేను అహా కూర అంటే వంకాయ కూరె కదా...ఈ కూరను పోగుడుతూ ఏదో ఒక సినిమాలో ఏకంగా ఒక పాటే పెట్టారు కదా అని అన్నాను... దానికి మా ఒక అయ్యవారు ఇలా అన్నారు...వంకాయ కూర గురించి చెప్పటానికి పాట ఏమీ సరిపోతుంది బాసు... దాని విసిస్టతను పూర్వపు కవి పుంగవులు ఎప్పుడో వర్ణించారని ఈ క్రింది పద్యాన్ని చెప్పారు...
వంకాయ కూర వంటి కూరయూ
లంకా పతి వైరి వంటి రాజుయూ
పరమేసుని వంటి దైవము
పంకజ ముఖి సీత వంటి పడతుల్ గలరే...
పరమేసుని వంటి దైవము
పంకజ ముఖి సీత వంటి పడతుల్ గలరే...
అహా ఎంత బాగా సెలవిచ్చారో కదా .... అని బాక్స్ ని కడగనవసరం లేకుండా కాలి చేసాము...
3 comments:
అసలు పద్యమిదండీ...
కం. వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే. :)
http://vaagvilaasamu.blogspot.com/2007/11/blog-post_02.html
సంక్రాంతి పండగ దగ్గిరికొస్తోంది గదా, అందుకని పొంగలి గుర్తొచ్చినట్టుంది మీకు :-)
కవి పుంగవులు!
అసలు పద్యం ఇది - దీన్ని కందపద్యం అంటారు
వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాపతి వైరి వంటి రాజును గలరే!
@రాఘవ,
అసలు పద్యం అలా ఉన్నప్పటికి మా అయ్యవార్లు మాత్రం దాన్ని ఇలా మార్చి మరొ విధంగా చెప్పారనుకుంటాను... నాకైతే ఈ పద్యంలొ చెప్పిన తీరు చాలా నచ్చింది, అందుకే ఇలా మార్చిన పద్యంతోనే లాగించెద్దామనుకుంటున్నాను... ఏది ఏమైనప్పటికి నన్ను సరి చేసినందుకు నెనరులు...
@కొత్త పాళీ,
తప్పులు సరిదిద్దినందుకు నెనరులు... మిగతాది పైన చెప్పాను...
Post a Comment