Nov 21, 2007

ప్రేమకు స్నేహానికి మద్య ...

ప్రేమకు స్నేహానికి మద్య వ్యత్యాసం .... అనే పోస్ట్ ఎక్కడో చదివిన వెంటనే నా మదిలో కొన్ని ఆలోచనలు ... అందులోంచి కొన్ని...

నేను కాలేజీ చదివే రోజుల్లో ప్రతి వారం ఇంటికి ఉత్తరం రాసే వాడిని, ఉత్తరం రాయటం అనేది కూడా ఒక కల అని అవే ఉత్తరాలను నేను సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు చదివితే అర్థం అయ్యింది. నేను ఎన్ని తప్పులతో ఉత్తరం రాసెవాడినొ అవి చదివి ఇంట్లో వాళ్ళు ఎంతగా నవ్వు కున్నారో కదా అని తర్వాత అర్థం అయ్యింది. ఐతే ఇప్పుడా గొడవ లేదు, ఎంచక్కా జనాలాంత Email రాయటం నేర్చెసుకుంటున్నారు మరియు ఈ మద్య కొత్తగా తెలుగులోనే రాయటం మొదలు పెట్టాక దస్తూరి గురుంచిన బెంగ లేకుండా పోయింది.కానీ ఎంతైనా తమ హస్తాలతో సొంతగా రాయటంలో ఉన్న ఆనందం ఆ రాసిన వారికే తెలుస్తుంది అలాగే ఆది చదివిన వారికే తెలుస్తుంది అందులోని ఆప్యాయత ఏమిటో...

మొత్తానికి నేను మాత్రం ఒకటి గుర్తించ గలిగాను... ఒక మనిషి "Creative" గా మారటానికి "ప్రేమ" ఎంతగానో ఉపయోగ పడుతుందని...ప్రేయసికి ఉత్తరాలు రాయటం మొదలైన నుంచి ఎంతో మార్పు ...ఉదాహరణకు ...

" ప్రతి వారం నీ ఉత్తరం గురుంచి ఎదురు చూస్తుంది ఎందుకో తెలుసా... అందులోని అందమైన నీ దస్తూరి కోసం మాత్రమే కాకుండా ఆ ఉత్తరానికి అంటించి ఉన్న స్టాంప్ వెనకాల ఉన్న నీ పెదవుల తడి కోసమే ప్రియా..."

ఉత్తరాలు రాయటమే కాదు ... నాలో నిద్రాణంగా దాగి ఉన్న ఒక చిత్రాకారుడు మేలుకొన్నాడు...ఎన్నో గొప్ప చిత్రాలు ఎందరీవో వేసి వారికి బహుమానంగా ఇవ్వగలిగాను.

స్నేహం వల్ల ఇది సాద్యం అవుతుందా అన్నది ... 100 శాతం నిక్కచ్చిగా చెప్పలేము ...

ఇవన్ని నా సొంత అబిప్రాయాలు మాత్రమే ... మీకు కూడా ఇలాంటిదే ఏమైనా జరిగిందా....?

3 comments:

, said...

meeru sagame raasinattunnnaru

రాధిక said...

బాగుంది వ్యాసం.కానీ మీతో నేను 100 శాతం ఏకీభవించను.స్నేహం వల్ల సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు? స్నేహితులు రాసిన సెలవు చీటీ లాంటి లేఖ కొన్నేళ్ళ తరువాత చదివి చూడండి.ఆ అనుభూతి ఎలా వుంటుందో మీకే తెలుస్తుంది.ఉత్తరం రాయాలంటే కవులయిపోనక్కలద్దు.స్నేహం లో కూడా ఎంతో భావుకతతో రాసుకున్న లేఖలు చాలానే వున్నాయి.అందుకు నేను,నా స్నేహితులు రాసుకున్న ఉత్తరాలే వుదాహరణ.

venku ... said...

నేను ఇక్కడ చెప్పదలచుకుంది బావుకత గురించి కాదు మేడమ్ అలాగే అనుబూతుల గూర్చి అంతకన్నా కాదు, ప్రేమ వల్ల మనిషిలోని " Creativity" పెరుగుతుందని కానీ స్నేహం వల్ల కాదని, దాన్ని విపులించాలని ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను అంతే ... అంతెందుకు ప్రేమ వల్ల ఒక "తాజ్‌మహల్" వెలసింది కానీ స్నేహం వల్ల ఇలాంటిదే ఏదైన వెలసిందేమో ఒక ఉదాహరణ ఇవ్వండి మీరు....

అలా అని నేనెదో స్నేహాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని మీరు భావించవద్దు... ఇందులో నాయొక్క అభిప్రాయం ఏమంటే మనిషిని సమూలంగా మార్చే శక్తి మాత్రం 'ప్రేమ' కె ఉంది...