నేను ఈ మధ్య ఒక నవల చదివాను ... పేరు సరిగా గుర్తులేదు కానీ అందులోని ఒక అంశం చాలా బాగా నచ్చింది ... ఆది మీతో పంచుకోవాలన్నది నా చిరు కోరిక...ఇందులో జీవితం గురుంచి కవి ఎంత బాగా చెప్పాడో కదా అని నాకు అనిపించింది... అందుకే ఆది ఇక్కడ రాయదలచాను...
ఇక కథలోకి వెలితే ...ఒక మెజీషియన్ స్టేజి పైన ఒక పెద్ద పాలిథిన్ కవరు పట్టుకుని నించుని ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడుతాడు...ఇది ప్రస్తుతం కాలిగా ఉంది కదా, తన సహచరున్ని పిలిచి అందులో నిండుగా పట్టే విధంగా చాలా పెద్ద రాళ్లు వేయమని చెప్తాడు, అప్పుడు అతని సహచరుడు అలాగే ఆ పాలిథిన్ కవరు నిండుగా పెద్ద రాళ్లతో నింపుతాడు.ఇప్పుడు మెజిషియను ప్రజలనుద్దేశించి ఇది పూర్తిగా నిండింది కదా అని అడుగుతాడు... అప్పుడు ప్రేక్షకుల్లోంచి దాదాపు సగం మంది ఆది పూర్తిగా నిండిందని ఒప్పుకుంటారు.అలా ఒప్పుకున్న వారందరిని ఒక ప్రక్కగా కూచోమని చెప్తాడు. ఆ మిగిలిన సగం మందితో మీరు కరెక్ట్ గానే ఉహించారని చెప్పి తన సహచరున్ని అలా నిండి ఉన్న కవరులొకిచిన్న చిన్న గులక రాళ్లు వేసి కుదుపమని ఆజ్ఞ వేస్తాడు దాంతో అతని సహచరుడు అల్లాగే చేస్తాడు. ఇప్పుడు మళ్లీ మెజిషియను ఆ మిగిలిన ప్రజలనుద్దేశించి ఇప్పుడు ఈ కవరు పూర్తిగా నిండినదని అనుకుంటాను అని అంటాడు. అప్పుడు అందులోంచి దాదాపు 90% సరేనని ఒప్పుకుంటారు. ఈ సారి వీరిని కూడా మొదటిసారి ప్రక్కగా కూచున్న వారితో కలవమని చెప్తాడు. ఆ మిగిలిన 10% మందితో మీరుహించినట్టే ఇందులో ఇసుకను నింప వచ్చని చెప్పి తన సహచరుని సహాయంతో నిండుగా ఏ మాత్రం కాలి లేకుండామొత్తంగా ఆ కవరుని నింపి ఇప్పుడు ఇది పూర్తిగా నిండినట్టే కదా అని అడుగుతాడు అప్పుడు ఆ మిగిలిన 10% లోంచి 9% సరేనని ఒప్పుకుంటారు. ఆ మిగిలిన 1% ప్రజలు ఆ కవరుని నీటితో నింపి ఇప్పుడు పూర్తిగా నిండిందని ఒప్పుకుంటారు, మెజిషియను కూడా వారితో ఏకీబవిస్తాడు.
ఇప్పుడు దీన్ని జీవితానికి అనువదిస్తే ...
జీవితాన్ని ఒక పాలిథిన్ కవరు అనుకుంటే మొదటగా నీవు దేనితో నింపావన్నది చాలా ముఖ్యమైన విషయము... ఒకవేళ నీవు మొదటే ఇసుకతో నింపావనుకో అందులో పెద్ద రాళ్లు, చిన్న చిన్న గులక రాళ్లు పట్టవు .. కాబట్టి మన జీవితంలో ఏ విషయం ఏ కోవలోకి వస్తుందో ముందుగానే గుర్తించి పైన చెప్పిన క్రమలో నింపుతేనె ఆ జీవితానికిఅర్థము ఉంటుంది అలాగే సుక సంతోషాలు కూడాను...
So fill properly and ENJOY the LIFE....
No comments:
Post a Comment