Oct 18, 2007

అశోకుడు చెట్లు నాటించెను...

అశోకుడు చెట్లు నాటించెను అని మనము చిన్నప్పుడు చదువుకున్నాము. ఈ పదాన్ని మరొక సారి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులొ తప్పు ఉన్నదని అనిపిస్తుంది. అశోకుడు మొక్కలను కదా నాటించాల్సింది, చెట్లు ఎలా నాటించాడబ్బా అన్న సందేహాము కలగక మానదు. కాని అశోకుడు చెట్లు మాత్రమే నాటించాడు మొక్కలను కాదు అన్నది నగ్న సత్యం అని ఈ క్రింది బొమ్మను చూస్తే మీకే అర్థం అవుతుంది.

ఈ పద్దతిని చైనా దేశం లొ ఇప్పటికి పాటిస్తారంటె మీరు నమ్మగలరా?


(Photo courtesy by Lolla Sudhakar - My BOSS)
taken in the month of March 2007.

3 comments:

Anonymous said...

చైనాలోనే కాదండి. మన భారద్దేశంలో కూడా...L & T ఈ విషయంలో ఆరితేరింది. మన ఐ.యస్.బీ లో వున్న మహా చెట్లన్నీ అలా తెచ్చి నాటినవే. ఇలా నాటడం నేను సింగపూర్లో మొదటి నుంచి చివరి వరకూ గమనించా...

Anonymous said...

china lone kaadu sir, singapore, malaysia, hongkong lalo kuda nenu chusanu ila chetlu naatadam. good note.

Anonymous said...

వృక్షో రక్షితి రక్షిత:
ఇంకెప్పుదండీ