
Feb 29, 2008
Feb 14, 2008
ప్రేమ.... ఒక తీయని బాధ

ప్రేమ.... ఒక తీయని బాధ....అది అనుభవించినవారికే తెలుస్తుంది... అంతటి తీయటి బాధను గుర్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక రోజును ప్రతి సంవత్సరం జరుపుకోవటం చాలా అనంద దాయకం....నేటి యువతలో, విఫలమైన ప్రేమ నుండి కూడా స్పూర్తిని పొందగలిగే స్పందన వచ్చినప్పుడే ఈ రోజుకు ఒక సార్థకత వస్తుందని నా అభిప్రాయం.... నా బ్లాగును వీక్షీంచేందుకు విచ్చేసిన పెద్దలు మరియు పిన్నలందరకు "ప్రేమికుల రోజు శుభాకాంక్షలు"....
Jan 10, 2008
1-కాయ...
నాగ మురళి గారి కవిత్వానికి మూడు ఎప్పుడు వస్తుంది అన్న వ్యాసం చదివాక ... నాకు ఇలాంటిదే ఒక చిన్న పద్యం గుర్తుకు వచ్చి ఆది మీతో పంచుకో దలచాను.నేను ఇంతకు క్రితం పని చేసే కంపనీ లో మధ్యాహన్నం బోజన సమయంలో నేను మరియు మరో ఇద్దరు అయ్యవార్లు కలసి బొజనము చేసిన తర్వాత తాపీగా కూచోని చాలా విషయాలు మాట్లాడే వారము ... ఆ రోజు మేము తెచ్చుకున్న టిఫీను బాక్స్ లో వంకాయ కూర అదిరింది... దాని గురించి నేను అహా కూర అంటే వంకాయ కూరె కదా...ఈ కూరను పోగుడుతూ ఏదో ఒక సినిమాలో ఏకంగా ఒక పాటే పెట్టారు కదా అని అన్నాను... దానికి మా ఒక అయ్యవారు ఇలా అన్నారు...వంకాయ కూర గురించి చెప్పటానికి పాట ఏమీ సరిపోతుంది బాసు... దాని విసిస్టతను పూర్వపు కవి పుంగవులు ఎప్పుడో వర్ణించారని ఈ క్రింది పద్యాన్ని చెప్పారు...
వంకాయ కూర వంటి కూరయూ
లంకా పతి వైరి వంటి రాజుయూ
పరమేసుని వంటి దైవము
పంకజ ముఖి సీత వంటి పడతుల్ గలరే...
పరమేసుని వంటి దైవము
పంకజ ముఖి సీత వంటి పడతుల్ గలరే...
అహా ఎంత బాగా సెలవిచ్చారో కదా .... అని బాక్స్ ని కడగనవసరం లేకుండా కాలి చేసాము...
Jan 3, 2008
అన్ని సంవత్సరాలు ఒకలా ఉండవు...
అన్ని సంవత్సరాలు ఒకలా ఉండవు...
ఈ సంవత్సరం మీ అందరకు శుభాలు మరియు ఎనలేని సంతోసాలు అందించాలని మనసారా కోరుకుంటూ...

ఈ సంవత్సరం మీ అందరకు శుభాలు మరియు ఎనలేని సంతోసాలు అందించాలని మనసారా కోరుకుంటూ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2008

Subscribe to:
Posts (Atom)